![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1080 లో..... రేఖ ఆస్తులన్నీ తన సొంతం చేసుకోవడానికి ఇందుని సంతకం పెట్టమని అంటుంది. ఇందు పెట్టబోతుంటే నందు వచ్చి ఒక అక్క సంతకం పెడితే చెల్లదు.. నేను కూడా పెట్టాలి.. నేను కూడా ఈ ఇంటికి వారసురాలిని అని నందు గతం తాలూకా జ్ఞాపకాలన్నీ చెప్తుంది. ఇది సరిపోతుందా ఇంకా ఆధారాలు కావాలా.. నేను చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళాక ఒక పోలీస్ ఆయన నన్ను చేరదీసాడు. ఇలాంటి సిచువేషన్ వస్తుందని ముందే ఊహించాడు.
అందుకే అప్పుడు నేను మిస్ అయినట్లు మిస్సింగ్ కేసు పెట్టాడు అని దానికి సంబంధించిన ప్రూవ్ అని రేఖకి నందు చూపిస్తుంది. దాంతో అందరు తను నందు అని ఫిక్స్ అవుతారు. ఇప్పుడు మీకు కావల్సింది సంతకం పెట్టాలంతే కదా అని పేపర్స్ ని తీసుకొని చింపిస్తుంది. నేను ఉండగా ఈ ఆస్తులన్నీ మీ సొంతం కావని నందు చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత సుభాష్ దగ్గర నందు ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇన్ని రోజులు నువ్వు లేవని ఎంత బాధపడ్డామో తెలుసా అని అపర్ణ ఎమోషనల్ అవుతుంది. నా గురించి అక్కకి తెలుసని నందు చెప్పగానే ఎందుకు మాకు చెప్పలేదని అపర్ణ అడుగుతుంది. తనే చెప్పొద్దని మాట తీసుకుందని ఇందు చెప్తుంది.
అసలు ఇదంతా ఎవరు చెప్పారని నందుని ఇందు అడుగుతుంది. బావ చెప్పాడని నందు చెప్తుంది. రాజు ఇక్కడ లేకున్నా తన బాధ్యత మర్చిపోలేదని అపర్ణ అంటుంది. ఇప్పటికైనా తనని ఇంటికి పిలువమని అపర్ణ అనగానే ఈ ప్రాబ్లమ్ లోకి తనని తీసుకొని రానని ఇందు చెప్తుంది. తరువాయి భాగంలో రేఖని అంటోని కలిసి మాట్లాడతాడు. ఆ లక్కీ గాడు నీ గురించి చెప్పమని అంటున్నాడని ఆంటోనీ అంటాడు. అవన్నీ రాజు విని షాక్ అవుతాడు. రేఖ దగ్గరికి వచ్చి రేపు ఇంట్లో లక్కీ నీ కొడుకు అని ఒప్పుకో లేదంటే నేనే అందరికి చెప్పేస్తానని రాజు అనగానే రేఖ భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |